అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట అడ్డురోడ్డు సర్కిల్ కార్యాలయానికి రావణ్‌ను పోలీసులు తీసుకొచ్చిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. నిన్ననే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు రావణ్‌ను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ రోజు అతడిని సర్కిల్ కార్యాలయానికి తరలించారు.
సర్కిల్ కార్యాలయం వద్ద రావణ్‌కు వ్యతిరేకంగా జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. అతనిపై తీసుకున్న చర్యలకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఘటన కారణంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు అదనపు బలగాలను మోహరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news