ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో పాముల జాతులు ఉన్నప్పటికీ, వాటిలో కొన్నింటి విషం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఈ పాములు సాధారణంగా మనుషులపై దాడి చేయడానికి ప్రయత్నించవు. అయితే ప్రమాదాన్ని గుర్తించినప్పుడు లేదా అనుకోకుండా వాటికి దగ్గరగా వెళ్లినప్పుడు మాత్రమే కాటు వేసే అవకాశం ఉంటుంది. అందుకే అడవులు, కొండ ప్రాంతాలు, గడ్డి మైదానాలు లేదా పాములు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు ప్రయాణించే వారు వాటి నివాస ప్రాంతాల గురించి అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పది పాములు, అవి ఎక్కువగా కనిపించే ప్రాంతాల గురించి తెలుసుకుందాం. రెండో స్థానంలో కోస్టల్ తైపాన్ ఉంటుంది. ఇది కూడా ప్రధానంగా ఆస్ట్రేలియా, పాపువా న్యూ గినియా ప్రాంతాల్లో కనిపిస్తుంది. వేగంగా కదలడం, వరుసగా పలుమార్లు కాటు వేయగల సామర్థ్యం దీని ప్రత్యేకత. అడవులు, వ్యవసాయ ప్రాంతాల్లో సంచరించే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యంత విషపూరితమైన పాముల జాబితాలో ఇన్‌ల్యాండ్ తైపాన్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇది ప్రధానంగా ఆస్ట్రేలియాలోని పొడి ఎడారి ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన విషాన్ని కలిగి ఉన్న ఈ పాము సాధారణంగా మనుషులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. అందువల్ల దీని కాటుకు గురయ్యే ఘటనలు చాలా అరుదుగా నమోదవుతాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news