మహారాష్ట్రలో సంచలనం రేపిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో సియా గోయల్, చేతన్ చౌదరి అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దర్యాప్తులో భాగంగా నిందితులకు పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి కోరారు. అలాగే నార్కో అనాలసిస్ పరీక్షలు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందని అభ్యర్థించారు. అయితే ఈ పరీక్షలకు నిందితులు స్పష్టంగా నిరాకరించారు.
నిందితుల సమ్మతి లేకుండా ఇటువంటి పరీక్షలకు అనుమతి ఇవ్వలేమని కోర్టు పేర్కొంది. దీంతో పోలీసుల విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, కీలక ఆధారాల సేకరణపై పోలీసులు దృష్టి సారించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news