రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఎయిర్పోర్ట్ నూతన టెర్మినల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుమారు రూ.480 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ ఆధునిక టెర్మినల్‌ను ప్రజలకు అంకితం చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు, ఆధునిక సాంకేతికతను దృష్టిలో ఉంచుకుని ఈ టెర్మినల్‌ను అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సవరించిన ‘ఉడాన్ 2.0’ పథకాన్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడం ఈ పథక ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. చిన్న నగరాలను ప్రధాన విమాన మార్గాలతో అనుసంధానించి ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ పథకం ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, గజేంద్రసింగ్ షెకావత్, రాజస్థాన్ గవర్నర్ హరిబావ్ కిసన్‌రావ్ బాగ్డే, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ పాల్గొన్నారు. జోధ్‌పూర్ విమానాశ్రయం అభివృద్ధి రాజస్థాన్‌కు కొత్త కనెక్టివిటీ అవకాశాలను తెస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news