విజయవాడలో గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఆయన తల్లి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిని అత్యంత దారుణంగా హింసించి హత్య చేశారని ఆమె ఆరోపించారు. కేసులో ఇప్పటివరకు కొంతమందినే అరెస్టు చేశారని, కానీ అసలు బాధ్యులంతా ఇంకా బయటే ఉన్నారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సాయికృష్ణ మృతికి సంబంధించిన పూర్తి నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేసిన ఆమె, తన కుమారుడి మృతదేహం లేదా బూడిదైనా తమకు ఇవ్వాలని కోరారు. కేసులో న్యాయం జరగకపోతే తాము తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.
లాకప్ డెత్ వెనుక ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తులను ఎందుకు అరెస్టు చేయలేదని ఆమె ప్రశ్నించారు. తన కుమారుడిపై జరిగిన హింసలో మరికొందరి పాత్ర ఉందని, వారిని కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, బాధిత కుటుంబం చేసిన ఆరోపణలు మరింత తీవ్రతను సంతరించుకున్నాయి. నిజాలు వెలుగులోకి వచ్చి న్యాయం జరగాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news