ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఆకుల శ్రీనివాస్ దంపతులకు పెదపాలపర్రు గ్రామంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి అధ్యక్షతన బొర్రా చలమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి మాట్లాడుతూ పోలీసులు ప్రజల రక్షణ కోసం తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేస్తారని, కుటుంబ సుఖసంతోషాలను విస్మరించి విధులు నిర్వహిస్తారని కొనియాడారు. సమాజ రక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో తన సేవలతో చెరగని ముద్ర వేసిన ఆకుల శ్రీనివాస్‌కు పూలమాలలు, దుస్సాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఆయన శేష జీవితం ఆరోగ్యం, ఆనందం, సుఖసంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో కుటుంబం, ముఖ్యంగా భార్య అందించిన సహకారం మరువలేనిదని తెలిపారు. ఈ సన్మానం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని భావోద్వేగంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విట్టల్ రావు, సీఐ రవికుమార్, ఎస్ఐ వీరభద్రరావు, తోటి ఉద్యోగులు, బంధువులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ఆయన సేవలను ప్రశంసించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news