జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలను స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగేలా పూర్తి పారదర్శకతతో రైతులకు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. రాజముద్ర అనేది వ్యవస్థకు చిహ్నమని, వ్యక్తి కేంద్రంగా కాకుండా వ్యవస్థ కేంద్రంగా పాలన సాగాలనే ఉద్దేశంతో ఈ మార్పులు తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో మొత్తం 1643 పాస్ పుస్తకాలకు గాను 1408 పుస్తకాలు పంపిణీ చేయగా, మిగిలిన 235 పుస్తకాలను సాంకేతిక పరిశీలన అనంతరం వారం రోజుల్లో అందజేస్తామని ఎమ్మార్వో జేవీఆర్ రమేష్ తెలిపారు.
గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ, రైతుల భూములకు సంపూర్ణ రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. రైతు సమస్యలను రాజకీయ అంశంగా కాకుండా పరిష్కార దిశగా చూడాలని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ, జనసేన నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news