విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి 79వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 21 డివిజన్లలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగా గారి విగ్రహాల వద్ద మరియు ప్రధాన కూడళ్లలో జరిగిన కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని మహానేతకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చిన్నారులకు పుస్తకాల పంపిణీ, పేదలకు పండ్ల పంపిణీ, కేక్ కటింగ్ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో కలిసి జయంతి వేడుకలను నిర్వహించారు. వంగవీటి మోహనరంగా గారి ఆశయాలను భావితరాలకు చేరవేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
బొండా ఉమా మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ప్రజానాయకుడని కొనియాడారు. కుల, మతాలకు అతీతంగా ప్రతి పేదవాడి కష్టాన్ని తన కష్టంగా భావించి ప్రజల కోసం నిరంతరం పోరాడిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనదని చెప్పారు.
విజయవాడ నగరంలో భయానక పరిస్థితులు నెలకొన్న సమయంలో మహిళలు, చిన్న వ్యాపారులు, కార్మికులు మరియు బలహీన వర్గాల ప్రజలకు ధైర్యం చెప్పి అండగా నిలిచిన నాయకుడు రంగా గారని ఆయన పేర్కొన్నారు. అన్యాయానికి, అక్రమాలకు వ్యతిరేకంగా రాజీపడకుండా పోరాడి ప్రజల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేతగా ఆయన నిలిచిపోయారని అన్నారు.
రంగా గారి ఆశయాలు నేటికీ లక్షలాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని, ఆయన చూపిన మార్గంలో న్యాయం, సమానత్వం, సేవా భావాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ఆయన లక్ష్యమని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, రాధా-రంగా మిత్రమండలి సభ్యులు, అభిమానులు, మహిళలు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news