అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూనియర్ లాయర్లకు శుభవార్త ప్రకటించింది. రాష్ట్రంలో జూనియర్ లాయర్ల స్టైఫండ్‌ను రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం న్యాయవృత్తిలోకి కొత్తగా అడుగుపెడుతున్న యువ న్యాయవాదులకు ఆర్థిక భరోసా కలిగించనుందని అధికారులు తెలిపారు.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కోర్టుల ద్వారా న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు కేసుల వేగవంతమైన పరిష్కారానికి దోహదపడనుందని భావిస్తున్నారు. అలాగే 1,770 పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ నిర్ణయం ప్రాంతీయ న్యాయసేవలను మరింత చేరువ చేయడమే కాకుండా ప్రజలకు సులభంగా న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషించనుందని అధికారులు పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news