చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన కుప్పం బస్‌స్టేషన్, డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఆధునిక మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కుప్పం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి లేకుండా స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పంలో సుమారు 80 వేల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించనున్నట్లు ఆయన వెల్లడించారు. యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టనున్నట్లు తెలిపారు.
కుప్పంను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. పండ్ల తోటల సాగు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతులకు స్థిర ఆదాయం కల్పించడమే లక్ష్యమని వివరించారు.
కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల కల్పన ద్వారా కుప్పాన్ని నమూనా నియోజకవర్గంగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Fetching videos...
Fetching latest news...
No trending news