ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఉల్లి కొనుగోలు ధరను 13 శాతం పెంచుతూ బఫర్ స్టాక్ కోసం కొత్త ధరలను ఖరారు చేసింది. తాజా నిర్ణయంతో క్వింటాల్ ఉల్లి కొనుగోలు ధర రూ.2,125కు చేరింది. గతంలో ఈ ధర రూ.1,875గా ఉండగా, తాజా పెంపుతో రైతులకు మెరుగైన ఆదాయం లభించనుందని అధికారులు తెలిపారు.
ఈ సీజన్లో ఉల్లి మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదుసార్లు పెంచింది. మార్కెట్లో ధరల స్థిరత్వం కల్పించడంతో పాటు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బఫర్ స్టాక్ కోసం ఉల్లి సేకరణను వేగవంతం చేయాలని సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా ఉల్లి ఉత్పత్తి, సరఫరా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది. రైతుల నష్టాలను తగ్గించడంతో పాటు వినియోగదారులకు కూడా ధరల స్థిరత్వం కల్పించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news