కుప్పంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిని పరిశ్రమలు వెళ్లిపోయాయని, కానీ గత రెండేళ్లలో ఆ నష్టాన్ని సరిదిద్దుతూ తిరిగి పెట్టుబడులను ఆకర్షించగలిగామని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పుడు పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని సీఎం తెలిపారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నాయని ఆయన అన్నారు. “అడిడాస్” కంపెనీ కోసం పొరుగు రాష్ట్రాలు పోటీ పడినా, చివరికి అది కుప్పానికి రావడం రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు.
అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ఒక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తుంటే, కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నాయని సీఎం విమర్శించారు. అయితే ప్రజల మద్దతు ఉన్నంత వరకు అభివృద్ధిని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని మళ్లీ పెట్టుబడుల హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news