ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి అత్యంత విలువైన హక్కు ఓటు హక్కు అని కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారం (గణన ఫారం)ను పూర్తిగా పూరించి, అవసరమైన పత్రాలతో సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)కు నిర్ణీత గడువు జూలై 14వ తేదీలోగా సమర్పించాలని ఆయన సూచించారు. జూలై 21న విడుదలయ్యే డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు ఉండాలంటే ఈ ఫారం సమర్పణ తప్పనిసరి అని తెలిపారు.
చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, ఓటరు వివరాలను ఒకసారి ధృవీకరించుకోవాలని ఆయన సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత BLOను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే ప్రతి అర్హత కలిగిన ఓటరు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగస్వామి కావాలని, ప్రభుత్వానికి మరియు ఎన్నికల సంఘానికి సహకరించి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Fetching videos...
Fetching latest news...
No trending news