కడప మరియు అన్నమయ్య జిల్లాల పరిధిలోని ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్–18 ఆధ్వర్యంలో లిటిల్ జీనియస్ కిడ్స్ వరల్డ్ ప్రీ స్కూల్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం ఫౌండర్ పి. వెంకటేశ్వర రావు అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో రీజినల్ ప్రెసిడెంట్ శ్రీమతి అనిత, రీజినల్ సెక్రటరీ బ్రహ్మానంద రెడ్డి తదితరులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశభక్తి, త్యాగం, ధైర్యసాహసాలు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని వారు కొనియాడారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన అల్లూరి సీతారామరాజు ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశభక్తి, సేవాభావం మరియు సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రీజియన్–18 సర్వీస్ హెడ్ మౌనిక, రాము, ఎలిజిబిత్ పాలగిరి, నాగిరెడ్డి, సాయి సుధ, శివ, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొని అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులు అర్పించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news