రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హాజరై అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాలు, గిరిజనుల హక్కుల కోసం చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు చేరవేసే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు. అనంతరం ఎంపీ ఏఎంసీ కార్యాలయాన్ని సందర్శించి సేవలను పరిశీలించారు.
ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి గురవాన నారాయణరావు సేవలను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యాలయంలో పరిశుభ్రత పాటించడం, ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వేగంగా పరిష్కరించడం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, కరణం శివశంకర్, పెంకి గౌరీశంకర్ రావు, రెడ్‌క్రాస్ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news