11వ ఏపీఎస్పీ పోలీస్ బెటాలియన్లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ పి. రాజశేఖర్ అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని దేశసేవకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అల్లూరి పోరాటం ప్రత్యేక అధ్యాయమని ఆయన పేర్కొన్నారు. గిరిజనుల హక్కుల కోసం సాయుధ పోరాటం చేసిన మహోన్నత నాయకుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
కేవలం 27 ఏళ్ల వయస్సులోనే బ్రిటిష్ పాలనకు సవాల్ విసిరిన అల్లూరి దేశభక్తి, ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. యువత క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తితో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్లు, బెటాలియన్ సిబ్బంది పాల్గొని అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news