మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా తెర్లాం శాఖ గ్రంథాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక గ్రంథాలయ అధికారి సీహెచ్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అల్లూరి జీవిత విశేషాలు, స్వాతంత్ర్య సమరంలో ఆయన చేసిన త్యాగాలు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి సాగించిన పోరాటం గురించి విద్యార్థులకు వివరించారు. చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయినప్పటికీ దేశభక్తిని విడువకుండా స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడిగా అల్లూరిని కొనియాడారు. ఆయన ధైర్యం, నాయకత్వ లక్షణాలు, దేశసేవా భావం నేటి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు.
అల్లూరి చూపిన త్యాగస్ఫూర్తిని ప్రతి యువత ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధి, సమాజ సేవలో ముందుకు రావాలని సూచించారు. దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం వంటి విలువలు నేటి తరానికి అత్యంత అవసరమని తెలిపారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని దేశభక్తి గీతాలు ఆలపిస్తూ అల్లూరికి ఘనంగా నివాళులర్పించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news