మచిలీపట్నం: కృష్ణా జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వీరంకి వెంకట గురుమూర్తి గారి ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని తెలుగు దేశం పార్టీ జిల్లా కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయ సాధనకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరంకి వెంకట గురుమూర్తి గారు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని కొనియాడారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
అలాగే దేశ వ్యవసాయ రంగ అభివృద్ధికి, ఆహార భద్రత బలోపేతానికి విశేషంగా కృషి చేశారని, రక్షణ శాఖ మంత్రిగా 1971 యుద్ధ సమయంలో సమర్థ నాయకత్వాన్ని అందించి దేశ విజయానికి తనవంతు సేవలు అందించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రజాసేవకు అంకితమైన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి బచ్చుల బోస్ గారు, జిల్లా ఉపాధ్యక్షుడు మోటమర్తి బాబా ప్రసాద్ గారు, జిల్లా అధికార ప్రతినిధి కోస్తా మురళి గారు, జిల్లా కార్యదర్శి వసంత కుమారి గారు, జిల్లా కార్యాలయ కార్యదర్శి బత్తిన దాస్ గారు తదితరులు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ గారికి ఘన నివాళులర్పించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news