13">ఈ25 (E25) పెట్రోల్ అమలుపై గత కొద్దిరోజులుగా చర్చ సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ20 (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, తదుపరి దశగా ఈ25 పెట్రోల్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుందా అనే ప్రశ్నలు తలెత్తా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ప్రధాన ఇంధన మిశ్రమం ఈ20. ఇందులో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ ఉంటుంది. ప్రభుత్వం చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ, రైతులకు ఇథనాల్ ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయం కల్పించడం వంటి లక్ష్యాలతో ఇథనాల్ మిశ్రమ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ20 లక్ష్యాన్ని నిర్ణయించిన గడువుకంటే ముందుగానే దేశవ్యాప్తంగా అమలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది యి. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ25 పెట్రోల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేసే విషయంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఈ25 పెట్రోల్ కూడా త్వరలో వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఈ25 అమలుకు ముందు పలు కీలక అంశాలను సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పాత వాహనాల అనుకూలత, ఆటోమొబైల్ పరిశ్రమ అభిప్రాయాలు, ఇంధన సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ25 అంటే పెట్రోల్‌లో 25 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం. ఇథనాల్ అనేది ప్రధానంగా చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారయ్యే బయోఫ్యూయల్. దీనిని పెట్రోల్‌తో కలపడం వల్ల శిలాజ ఇంధనాల వినియోగం తగ్గడం, కార్బన్ ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో దేశ విదేశీ మారక వ్యయాన్ని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుందని అధికారుల అభిప్రాయం.
Fetching videos...
Fetching latest news...
No trending news