యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరియు రిమోట్ వర్క్ వ్యవహారాల శాఖ మంత్రి ఒమర్ అల్ ఒలామా సాంకేతికత, డిజిటల్ మౌలిక సదుపాయాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు. సాంకేతిక అభివృద్ధి కొద్ది దేశాలు లేదా పెద్ద సంస్థలకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం, ప్రతి వర్గానికి ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (ఏఐ), డిజిటల్ పరివర్తన, క్లౌడ్ కంప్యూటింగ్, హై-స్పీడ్ ఇంటర్నెట్, డేటా సెంటర్లు వంటి రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే ఈ అవకాశాలు అన్ని దేశాలకు సమానంగా అందడం లేదని ఒమర్ అల్ ఒలామా పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సాంకేతిక అంతరం ఇంకా కొనసాగుతోందని ఆయన అన్నారు.డిజిటల్ మౌలిక సదుపాయాలు, వేగవంతమైన ఇంటర్నెట్, నాణ్యమైన డేటా కేంద్రాలు, క్లౌడ్ సేవలు, విద్యుత్ సరఫరా, డిజిటల్ నైపుణ్యాలు వంటి అంశాలను కూడా సమానంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ మౌలిక వసతులు లేకపోతే అత్యాధునిక సాంకేతికత కూడా ప్రజలకు ఉపయోగపడదని ఆయన వివరించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news