ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏ కొండూరు మండలానికి ఎంపీ కేశినేని చిన్ని కృషితో మరో అభివృద్ధి ప్రాజెక్టు మంజూరైంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో నివాస ప్రాంతాలను అనుసంధానం చేసే రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఎన్నో ఏళ్లుగా సరైన రహదారి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట లభించనుంది.
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన నాలుగో దశలో భాగంగా 2026-27 బ్యాచ్-1 కింద ఈ రహదారి పనులను చేపట్టనున్నారు. మొత్తం రూ.1.815 కోట్ల అంచనా వ్యయంతో 1.71 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్రం నుంచి వచ్చిన అనుమతి పత్రాన్ని ఎంపీ కేశినేని చిన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి రహదారులు, కనెక్టివిటీ వంటి ప్రాథమిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తే ప్రజల ప్రయాణ ఇబ్బందులు తగ్గడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపార రంగాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు.
ఏ కొండూరు మండలంలో గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో అనేక మంది బాధపడుతున్న నేపథ్యంలో వారికి మెరుగైన తాగునీటి సదుపాయం కల్పించేందుకు కూడా ఎంపీ కేశినేని చిన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తాజాగా రహదారి అనుసంధాన ప్రాజెక్టును కూడా తీసుకురావడంతో మండల అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.
సరైన కనెక్టివిటీ లేక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రోడ్డు మంజూరు చేయించడంలో ఎంపీ చిన్ని చొరవ కీలకంగా మారిందని స్థానిక నాయకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంపీ చేస్తున్న కృషికి ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో కేశినేని చిన్ని ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కేంద్ర పథకాలను తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.
ఏ కొండూరు మండలానికి మంజూరైన ఈ రహదారి పూర్తయితే స్థానిక ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు సమీప ప్రాంతాలతో అనుసంధానం మరింత సులభతరం కానుంది. గ్రామీణ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని అధికారులు, స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news