శ్రీసత్యసాయి జిల్లాలోని రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆమె, వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థినికి జరిగిన అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేశారు.
నిందితుడు ఎంతటివాడైనా ఉపేక్షించకూడదని మంత్రి సవిత అధికారులకు స్పష్టం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా, బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.
మహిళలు, బాలికల భద్రతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థినుల రక్షణ విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని భరోసా ఇచ్చారు. బాధిత బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారుల నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకుంటామని తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news