శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో పాఠశాల విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని పేర్కొంటూ, బాధిత విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అందుతున్న వైద్య చికిత్స, ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు.
బాధిత విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశారు.
ఈ ఘటనకు కారణమైన నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని డిప్యూటీ సీఎం ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడాలని అధికారులకు సూచించారు. విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news