విశాఖపట్నం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పలు పరీక్షలను వాయిదా వేశారు. రేపు నిర్వహించాల్సిన యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏయూ అధికారులు ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, ప్రారంభోత్సవ కార్యక్రమం దృష్ట్యా విశాఖ ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, రవాణా పరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విద్యార్థులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పరీక్షలను వాయిదా వేసినట్లు వెల్లడించారు.
రేపు జరగాల్సిన యూజీ పరీక్షలను ఆగస్టు 24వ తేదీకి మార్చినట్లు ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు తెలిపారు. వాయిదా పడిన ఇతర కోర్సుల పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
విద్యార్థులు కొత్త పరీక్ష తేదీలను గమనించాలని, యూనివర్సిటీ అధికారిక సమాచారం ఆధారంగా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రజా రవాణా, భద్రతా నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news