అమెరికాలో ప్రముఖ AI సంస్థ Anthropic తాజాగా విడుదల చేసిన రెండు అధునాతన AI మోడళ్లను విడుదలైన కొద్ది రోజులకే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనల కారణంగా వైట్ హౌస్ జోక్యం చేసుకుని ఈ నిర్ణయానికి దారితీసిందని Politico నివేదిక వెల్లడించింది.
నివేదిక ప్రకారం, Fable 5 మరియు Mythos 5 అనే కొత్త AI మోడళ్లలోని సేఫ్టీ గార్డ్రెయిల్స్ను దాటవేయగల అవకాశం ఉందని అమెరికా అధికారులు భావించారు. దీంతో ప్రభుత్వం సంస్థను స్వచ్ఛందంగా ఈ మోడళ్లను వెనక్కి తీసుకోవాలని ఒప్పించే ప్రయత్నాలు చేసింది. అయితే ఆ ప్రయత్నాలు విఫలమవడంతో ఎగుమతి నియంత్రణలు విధించినట్లు సమాచారం.
ఈ అంశంపై అమెజాన్ సీఈఓ ఆండి జెస్సీ కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆ తర్వాత వైట్ హౌస్ ఉన్నతాధికారులు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అనంతరం Anthropic సీఈఓ డారియో అమోడీతో ప్రభుత్వం చర్చలు జరిపింది.
కంపెనీ వర్గాలు మాత్రం కొన్ని ఆరోపణలను ఖండించాయి. సీఈఓ అందుబాటులో లేరన్న అభిప్రాయాన్ని “పూర్తిగా తప్పు” అని స్పష్టం చేశాయి. చివరకు చర్చలు విఫలమవడంతో జాతీయ భద్రతా కారణాలతో ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news