ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ఈ నెల 10వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఉద్యోగుల నుంచి వచ్చిన పలు డిమాండ్లు, పెండింగ్ సమస్యలు, సంక్షేమ అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్‌కమిటీ పలుమార్లు సమావేశాలు నిర్వహించి వివిధ అంశాలపై అభిప్రాయాలను సేకరించింది. ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, అమలు సాధ్యాసాధ్యాలపై అధికారులు సమగ్రంగా పరిశీలించినట్లు తెలుస్తోంది.
కేబినెట్ సబ్‌కమిటీ చర్చల అనంతరం ముఖ్యమంత్రి స్థాయిలో జరిగే ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించిన కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాలు కూడా ఈ భేటీపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news