బనగానపల్లె రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడిగా వంకధారా వేణుగోపాల్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పట్టణంలోని చెంచు తోటలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రామమూర్తి, చిన్నపు రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ సభ్యులు, ప్రజల సహకారంతో మరింత బాధ్యతగా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.
రోటరీ క్లబ్ సేవలను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ముఖ్యంగా రోటరీ ఐ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న ఉచిత కంటి వైద్య సేవలు ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. బనగానపల్లె పట్టణంలోని చెంచు తోటలో ఉన్న రోటరీ ఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు కూడా చేపడుతున్నారని తెలిపారు. ఎన్నో మంది పేదలకు కంటి చూపును అందించడంలో రోటరీ క్లబ్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గాధంశెట్టి వేణుగోపాల్, డాక్టర్ రవికుమార్, గాధంశెట్టి మోహన్, రామకృష్ణ, శ్రీరాములు, బలరాం, శ్రీరామ సుబ్రహ్మణ్యం, టంగుటూరి శీనయ్య, జంగంశెట్టి, సాయిరాం తదితరులు పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news