విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సిద్ధం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతంగా 13,500 మంది గిరిజన మహిళలతో సాంప్రదాయ థింసా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ఈ ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గిరిజన కళా వైభవాన్ని దేశానికి పరిచయం చేసేలా ఈ ఏర్పాట్లు చేశారు.
విమానాశ్రయ ప్రాంగణాన్ని ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా అలంకరించారు. స్వాగత ద్వారం వద్ద భారీ ఏటికొప్పాక కళాకృతిని ఏర్పాటు చేసి సందర్శకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే పలు ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు.
'ఉత్తరాంధ్రకు కలలకు రెక్కలు' అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం విశాఖ బీచ్ రోడ్డులో భారీ డ్రోన్ షో నిర్వహించనున్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ చూపే చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
Fetching videos...
Fetching latest news...
No trending news