భోగాపురంలో నిర్వహించిన భారీ థింసా నృత్య ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. సుమారు 13 వేల మంది గిరిజన బాలికలు ఒకే వేదికపై థింసా నృత్యాన్ని ప్రదర్శించి అరుదైన ఘనత సాధించారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించి రికార్డుగా గుర్తించారు.
థింసా నృత్యంలో రాష్ట్ర మంత్రి సంధ్యారాణి కూడా పాల్గొని గిరిజన కళా సంస్కృతికి మద్దతు తెలిపారు. గిరిజన సంప్రదాయ నృత్యాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేసిన ఈ కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఈ సాంస్కృతిక ప్రదర్శన ఘనంగా నిర్వహించారు.
థింసా నృత్య ప్రదర్శన అనంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని మంత్రి సంధ్యారాణికి అందజేశారు. ప్రభుత్వం తరఫున ఆమె ఈ గుర్తింపును స్వీకరించారు. గిరిజన కళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో ఇది చారిత్రాత్మక ఘట్టమని నిర్వాహకులు పేర్కొన్నారు.
భోగాపురం వేదికగా ఏర్పాటైన ఈ కార్యక్రమం గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పిందని పలువురు అభిప్రాయపడ్డారు. గిరిజన యువత ప్రతిభను ప్రోత్సహిస్తూ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టే ప్రయత్నంలో ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు మరో మైలురాయిగా నిలిచింది.
Fetching videos...
Fetching latest news...
No trending news