ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘BIOPACKATHON 2026’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భూమిలో కరిగిపోయే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌కు సంబంధించిన వినూత్న ఆలోచనలు అందించే వారికి ఈ పోటీ ద్వారా బహుమతులు అందించనున్నారు.
ఈ పోటీలో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.10 లక్షలు, రెండవ స్థానానికి రూ.7 లక్షలు, మూడవ స్థానానికి రూ.5 లక్షల నగదు బహుమతులు అందజేయబడతాయి. నగదు బహుమతులతో పాటు విజేతలకు పరిశ్రమలతో కలిసి పనిచేసే అవకాశాలు కూడా లభిస్తాయి.
ప్లాస్టిక్‌కు పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం, కొత్త ఆవిష్కరణలను ప్రేరేపించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 ఏప్రిల్ 24లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news