భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రదర్శించిన థింసా నృత్యంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమంలో వేలాది మంది ఆడబిడ్డలు పాల్గొని ప్రదర్శించిన థింసా నృత్యం ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని సీఎం తెలిపారు.
థింసా నృత్యం మన సంస్కృతి, సంప్రదాయాలు, భవిష్యత్తు ఆకాంక్షలను ప్రతిబింబించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల వారసత్వ కళగా గుర్తింపు పొందిన థింసా నృత్యాన్ని ఇంత భారీ స్థాయిలో ప్రదర్శించడం ఎంతో గర్వకారణమని అన్నారు.
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 13 వేల మందికి పైగా ఆడబిడ్డలు ఒకే వేదికపై థింసా నృత్యం చేసి ప్రపంచ రికార్డు సృష్టించారని సీఎం వెల్లడించారు. ఈ అరుదైన ఘట్టం రాష్ట్ర సాంస్కృతిక చరిత్రలో ప్రత్యేక గుర్తింపుగా నిలిచిపోతుందని తెలిపారు.
అభివృద్ధితో పాటు వారసత్వ పరిరక్షణ కూడా ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. మన సంప్రదాయాలను కాపాడుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు సాగడమే నిజమైన ‘వికాస్ భీ - విరాసత్ భీ’ స్ఫూర్తి అని అన్నారు.
అద్భుతమైన థింసా నృత్య ప్రదర్శన అందించిన ఆడబిడ్డలకు, వారికి శిక్షణ అందించిన గురువులకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. వారి కృషి ద్వారా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళా సంపదకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news