గుడివాడ పట్టణం 36వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆత్మీయంగా మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా మంజూరైన పింఛన్లు అందుకున్న వృద్ధులు, వితంతువులు ఎమ్మెల్యేకు మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. “మంచివాడు మా రాము” అంటూ పలువురు వృద్ధులు ఆయనతో ఫోటోలు దిగడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తూ అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. పింఛన్ల మంజూరు ప్రక్రియను సులభతరం చేయడం, వితంతు పింఛన్లను వేగవంతం చేయడం వంటి నిర్ణయాలు ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయని తెలిపారు.

కార్యాలయాల్లో కూర్చొని పాలన చేయడం కాకుండా, ప్రజల మధ్యే ఉండి వారి సమస్యలను పరిష్కరించాలన్న సీఎం ఆదేశాల మేరకు తాను గుడివాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. ప్రజల మద్దతుతో గుడివాడ అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టిడిపి నాయకులు, సచివాలయ సిబ్బంది మరియు స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news