లోపభూయిష్ట ఉత్పత్తులను విక్రయించిన తర్వాత వినియోగదారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత సంస్థలపై ఉంటుందని మరోసారి స్పష్టం చేస్తూ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. లోపాలు ఉన్న బూట్లను తిరిగి తీసుకున్నప్పటికీ కొనుగోలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా కేవలం క్రెడిట్ నోట్ మాత్రమే ఇవ్వడం సేవలలో లోపంగా పరిగణించిన కమిషన్, వినియోగదారుడికి బూట్ల ధర రూ.3,606ను తిరిగి చెల్లించడంతో పాటు పరిహారం, న్యాయపరమైన ఖర్చుల కింద మొత్తం రూ.15,000 చెల్లించాలని ఆన్లైన్ పాదరక్షల విక్రయ సంస్థను ఆదేశించింది. ఈ కేసు వినియోగదారుల హక్కులకు సంబంధించిన ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది. ఫిర్యాదుదారు కమల్ సింగ్ 2025 జూన్ నెలలో ప్రముఖ పాదరక్షల బ్రాండ్‌కు చెందిన రెండు జతల బూట్లను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశారు. ఒక జతను తన కోసం రూ.1,499కు, మరొక జతను తన కుమారుడి కోసం రూ.2,107కు కొనుగోలు చేశారు. మొత్తం కొనుగోలు విలువ రూ.3,606గా నమోదైంది.
బూట్లు అందుకున్న తర్వాత వాటిలో సైజు, నాణ్యతకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని వినియోగదారుడు గుర్తించారు. బూట్లు సరిగా సరిపోకపోవడం, నాణ్యత కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వాటిని తిరిగి పంపించాలని నిర్ణయించారు. సంస్థ కూడా బూట్లను తిరిగి స్వీకరించింది. అయితే కొనుగోలు చేసిన మొత్తాన్ని వినియోగదారుడి ఖాతాలోకి తిరిగి జమ చేయకుండా, మూడు నెలలపాటు మాత్రమే చెల్లుబాటు అయ్యే క్రెడిట్ నోట్‌ను జారీ చేసింది.
సంస్థ అంతర్గత విధానం ప్రకారం నగదు రీఫండ్ ఇవ్వడం సాధ్యం కాదని, క్రెడిట్ నోట్ ద్వారానే వినియోగదారుడు మరో ఉత్పత్తిని కొనుగోలు చేయాలని సూచించింది. అయితే వినియోగదారుడు దీనికి అంగీకరించలేదు. తాను చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వాలని పలుమార్లు ఇ-మెయిల్ ద్వారా కోరినప్పటికీ సంస్థ స్పందించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news