విశాఖపట్నానికి చెందిన ఓ వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరుకు చెందిన అరుణ్‌కుమార్‌పై తాడేపల్లి పోలీసులు అత్యాచారం, దాడి, కులం పేరుతో దూషించిన ఆరోపణలపై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, బాధితురాలికి రెండు నెలల క్రితం పరిచయం ఏర్పడిన నిందితుడు సోషల్ మీడియా వార్తా వేదిక ఏర్పాటు పేరుతో సాన్నిహిత్యం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాధితురాలు అతనికి నగదు ఇచ్చినట్లు, అనంతరం డబ్బు తిరిగి తీసుకోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు పోలీసులు తెలిపారు.
గత నెల 29న బాధితురాలు పార్టీ కార్యక్రమం నిమిత్తం తాడేపల్లిలోని ఓ హోటల్లో బస చేసిన సమయంలో నిందితుడు అక్కడికి వెళ్లి మాట్లాడే పేరుతో గదిలోకి ప్రవేశించి అత్యాచారం, దాడికి పాల్పడ్డాడని, కులం పేరుతో దూషించడంతో పాటు భర్తను వదిలి తన వెంట రావాలని వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు ఉన్న మొబైల్ ఫోన్లు, మెడలోని బంగారు గొలుసును కూడా తీసుకెళ్లాడని బాధితురాలు ఆరోపించింది.
ఆదివారం ఫోన్లు తిరిగి ఇస్తామని చెప్పి గుంటూరుకు రప్పించిన అనంతరం, తన స్నేహితులతో కలిసి కారుపై రాళ్లతో దాడి చేసినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు అరుణ్‌కుమార్‌పై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు. నిందితుడికి సహకరించిన మరో మహిళతో పాటు మరో వ్యక్తిపైనా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసును డీఎస్పీ మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, అరుణ్‌కుమార్‌పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది.
Fetching videos...
Fetching latest news...
No trending news