జార్ఖండ్లో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం మూడేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి కేసును గ్రామ పంచాయతీ సభ్యులు దాచిపెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించాయి. బాధిత చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాల్సిన స్థానిక పెద్దలు, చట్టపరమైన చర్యలకు సహకరించకుండా రాజీకి ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది బాధిత చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం లైంగిక దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవడంతో విషయం పోలీసుల దృష్టికి చేరింది. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఘటనను దాచిపెట్టేందుకు ప్రయత్నించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు ఈ ఘటనలో పంచాయతీ సభ్యుల పాత్రపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్థాయిలో ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులు చట్టాన్ని పక్కనబెట్టి రాజీకి ప్రయత్నించడం అత్యంత ఆందోళనకరమని బాలల హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల్లో తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అలాంటి కేసులను రాజీ ద్వారా పరిష్కరించడం చట్టవిరుద్ధమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
భారతదేశంలో చిన్నారులపై లైంగిక నేరాలను నిరోధించేందుకు పోక్సో (POCSO) చట్టం అమల్లో ఉంది. ఈ చట్టం ప్రకారం చిన్నారులపై జరిగే ప్రతి లైంగిక నేరాన్ని కఠినంగా విచారించి, నిందితులకు కఠిన శిక్షలు విధించే నిబంధనలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటువంటి నేరాలను దాచిపెట్టడం లేదా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అడ్డుకోవడం కూడా చట్టపరమైన చర్యలకు దారితీసే అంశమే.
కొనసాగుతోంది. .Fetching videos...
Fetching latest news...
No trending news