నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో “రెండేళ్ల నమ్మకం అభివృద్ధి - సంక్షేమం ఇంటింటి ప్రచారం” కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. 287 బూత్‌ల పరిధిలో ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వివరాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం 26వ డివిజన్ డ్రైవర్స్ కాలనీ బిట్-1లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.850 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరిగాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
గత పదేళ్లలో ఎమ్మెల్యేగా సాధించలేని అభివృద్ధిని ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో సాధించగలిగానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి మన్నెం పెంచలనాయుడు, కో క్లస్టర్ ఇంచార్జి కృష్ణారెడ్డి, కార్పొరేటర్ బూడిద సుప్రజ, డివిజన్ అధ్యక్షుడు బూడిద పురుషోత్తం యాదవ్‌తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించేందుకు చేపట్టిన ఈ ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజలతో మరింత అనుసంధానం ఏర్పడుతుందని పార్టీ నాయకులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news