కుప్పం నియోజకవర్గానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకులు తాడేపల్లిలోని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ డా. ఉండవల్లి శ్రీదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, సామాజిక న్యాయం, అభివృద్ధి అంశాలపై చర్చించారు.
కుప్పం ప్రాంత ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధి, సామాజిక వర్గాల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లినట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా డా. ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు మరింత చేరువగా ఉండి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు.
కుప్పం నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్, కుప్పం నియోజకవర్గ కో ఇంచార్జ్ పి. వెంకటేష్, రామకుప్పం మండల ఇంచార్జ్ గోవిందప్ప, మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షుడు జయప్ప, లక్ష్మణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news