కుప్పం మండలం వేపూరు మిట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. క్లస్టర్ ఇన్చార్జి హైదర్ వళీ, సీనియర్ టీడీపీ నాయకుడు చలపతి, కుప్పం నియోజకవర్గ కురబ అధ్యక్షుడు లీలావెంకటేష్, పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు మంజునాథ్, పంచాయతీ అటవీశాఖ చైర్మన్ షబ్బీర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. అతిథులు స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
కెనరా బ్యాంక్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ సహాయం విద్యాభ్యాసానికి ఎంతో ఉపయోగపడుతుందని అతిథులు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యలో రాణించాలని సూచించారు.
కెనరా బ్యాంక్ చేపట్టిన సేవా కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి స్వీట్లు పంపిణీ చేశారు. దేశభక్తి నినాదాల మధ్య వేడుకలు ఉత్సాహంగా ముగిశాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news