బోయచిన్నగన పల్లె పంచాయతీ లింగాపురం గ్రామంలో “ఇంటింటికి కూటమి ప్రభుత్వం - సంక్షేమ విజయం” కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ రామచంద్ర నాయుడు, యూనిట్ ఇంచార్జి హరినాథ్ రెడ్డి తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రభుత్వ విధానాలు, ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నాయకులు తెలిపారు.
గ్రామస్థులతో మాట్లాడిన నాయకులు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సంక్షేమం, గ్రామాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జి హరినాథ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ భక్తవత్సలం, మాజీ సర్పంచ్లు మణి, వైస్ సుబ్రమణి, పార్టీ అధ్యక్షుడు పాలమణి, బూత్ కన్వీనర్లు వెంకటేష్ చౌదరి, శంకర్, పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్ గౌడు, సీనియర్ నాయకులు మార్కొండ నాయుడు, ధనంజయ నాయుడు, వెంకటేష్, గణేష్, నారాయణరెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామస్థాయిలో ప్రజలతో నేరుగా మమేకమై ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించే ఈ ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయని నాయకులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news