చీరాల మండలం ఈపురుపాలెం గ్రామం సిండికేట్ వీవర్స్ కాలనీలో “ఇంటింటికి తెలుగుదేశం” ప్రచార కార్యక్రమాన్ని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ ప్రచార కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్, చిలకలూరిపేట ఏఎంసీ చైర్మన్, చీరాల నియోజకవర్గ పరిశీలకుడు షేక్ కరీముల్లా, సీనియర్ నాయకులు గుద్దంటి చంద్రమౌళి, చీరాల మండల అధ్యక్షుడు గంజి పురుషోత్తం, ఈపురుపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుర్రం వెంకటేశ్వర్లు, చీరాల మున్సిపల్ మాజీ చైర్మన్ మీంచాల సాంబశివరావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వార్డు టీడీపీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జీలు, నియోజకవర్గంలోని వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజలతో అనుసంధానం పెంచేందుకు ఇంటింటి ప్రచార కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని నాయకులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news