చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గ ప్రజలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
దేశ స్వతంత్రం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు ప్రజలు స్వేచ్ఛను అనుభవిస్తున్నారని మాలకొండయ్య పేర్కొన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.
రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ఐక్యత, సమానత్వం, సోదరభావంతో ప్రజలంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. జాతీయ జెండా పట్ల గౌరవం, దేశం పట్ల బాధ్యత, ప్రజాసేవ పట్ల అంకితభావం ప్రతి ఒక్కరిలో పెంపొందాలని ఆకాంక్షించారు.
చీరాల నియోజకవర్గ ప్రజలు, వారి కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే మాలకొండయ్య కోరుకున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొని జాతీయ పతాకానికి వందనం సమర్పించారు. అనంతరం పరస్పరం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news