1భారతదేశంలో ప్రస్తుతం వివాహానికి కనీస వయస్సు పురుషులకు 21 సంవత్సరాలు, మహిళలకు 18 సంవత్సరాలు. ఈ నిబంధనల అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి పెళ్లి కార్డులపై పుట్టిన తేదీల ముద్రణ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. బాల్య వివాహాలను ముందుగానే గుర్తించి అడ్డుకునేందుకు ఇది ఒక కీలక చర్యగా మారే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు
బాల్య వివాహాలను అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయంపై ఆలోచిస్తోంది. వధూవరుల పుట్టిన తేదీలను పెళ్లి ఆహ్వాన పత్రికలపై తప్పనిసరిగా ముద్రించే విధానాన్ని పరిశీలిస్తోంది. మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి
Aditi Tatkare ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విధానం ద్వారా వివాహ సమయంలో వధూవరుల వయస్సును సులభంగా ధృవీకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాజస్థాన్లో అమలవుతున్న నమూనాను అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ముద్రణశాలలు, వివాహ మండపాలు, కార్యక్రమ నిర్వాహకులను కూడా బాధ్యత పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదనలో ఉంది. నిబంధనల ఉల్లంఘనపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో బాల్య వివాహాల శాతాన్ని పది శాతానికి దిగువకు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.