మంగళగిరి పట్టణంలో 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుమహిళల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని 10వ వార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్, మంగళగిరి నియోజకవర్గ తెలుగుమహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు.
మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు కూడా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంపొందించడంలో భాగస్వాములు కావాలని సూచించారు.
స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా దేశభక్తితో పాటు సామాజిక బాధ్యతను చాటిచెప్పామని నిర్వాహకులు తెలిపారు. ప్రకృతి పరిరక్షణకు మహిళలు ముందుండటం అభినందనీయమని పేర్కొన్నారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు స్థానికుల సహకారం అవసరమని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉడత లావణ్య, బిట్ర మాధురి, గోరంట్ల లావణ్య, లలిత దేవి, చిల్లపల్లి లక్ష్మి, నాగమణి, త్రివేణి, చెరుకు నాగమణి, అంకం భాగ్య, కొల్లి సుజాత, కొల్లి ప్రమీల తదితర తెలుగుమహిళలు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news