చైనాలో ప్రముఖ బబుల్ టీ సంస్థ మాలీ టీకు లోగో వివాదంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ లూయీ విట్టాన్ ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించిందని కోర్టు తేల్చడంతో మాలీ టీ సంస్థకు 1.03 కోట్ల యువాన్లు (సుమారు 15 లక్షల అమెరికా డాలర్లు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత చైనాలో మేధో సంపత్తి హక్కులు, కాపీరైట్ పరిరక్షణ, డిజైన్ ప్రేరణలపై విస్తృత చర్చ మొదలైంది.
చైనా తూర్పు ప్రాంతంలోని జియాంగ్సు ప్రావిన్స్ కోర్టు ఈ కేసును విచారించింది. షెన్జెన్కు చెందిన మాలీ టీ సంస్థ తన లోగో రూపకల్పనలో లూయీ విట్టాన్కు చెందిన ప్రసిద్ధ నాలుగు రేకుల పుష్ప ఆకార ట్రేడ్‌మార్క్‌ను అనుకరించినట్లు కోర్టు అభిప్రాయపడింది. ఈ కారణంగానే ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన జరిగిందని తేల్చింది.
తీర్పు అనంతరం చైనా సామాజిక మాధ్యమాల్లో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసుకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌కు 40 కోట్లకు పైగా వీక్షణలు నమోదయ్యాయి. వేలాది మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు కోర్టు తీర్పును సమర్థించగా, మరికొందరు మాలీ టీకి మద్దతుగా నిలిచారు.
సుజౌ నగరంలోని కోర్టు మాలీ టీ సంస్థకు వివాదాస్పద లోగోను ఇకపై ఉపయోగించరాదని స్పష్టంగా ఆదేశించింది. అలాగే లూయీ విట్టాన్కు బహిరంగ క్షమాపణలు చెప్పడంతో పాటు 1.03 కోట్ల యువాన్ల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఈ వివరాలను చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థ వెల్లడించింది.
Fetching videos...
Fetching latest news...
No trending news