శృంగవరపుకోట నియోజకవర్గంలో ‘పేదల సేవలో NTR భరోసా’ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. కొత్తవలస మండలం మంగళపాలెం, దేశపాత్రునిపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి స్వయంగా పాల్గొని ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందజేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఒకటో తేదీన ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తూ భరోసా కల్పిస్తోందని తెలిపారు. ఇది ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగిస్తోందని పేర్కొన్నారు.
లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వు చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. అవ్వతాతలు తమకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆశీస్సులు అందజేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కూటమి కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాల్లో విస్తృతంగా నిర్వహించిన ఈ పంపిణీ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువైనట్లు స్పష్టమైంది.
Fetching videos...
Fetching latest news...
No trending news