విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు మాజీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పింఛన్లను అందించారు.
23వ డివిజన్ పరిధిలోని 93, 97, 98 పోలింగ్ బూత్ల సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమం కొనసాగింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా నిలిచిపోకుండా, అనుకున్న సమయానికి ముందుగానే అందిస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
గతంలో రాష్ట్రానికి రాజధాని లేకపోయినా ప్రస్తుతం అమరావతి ఏకైక రాజధానిగా ముందుకు సాగుతోందని బాలస్వామి పేర్కొన్నారు. ఒకప్పుడు గుంతల రోడ్లు ఉండేవని, ప్రస్తుతం మెరుగైన రహదారుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా గతంలో ఒక్కరికి మాత్రమే ప్రయోజనం అందగా, ప్రస్తుతం అర్హులైన ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూరుతోందని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని బాలస్వామి కొనియాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, రోడ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు చింత దుర్గారావు, స్పెషల్ ఆఫీసర్ గిరి, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news