ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్ అన్నారు. ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాలు, పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) సూచనల మేరకు 64వ డివిజన్ కండ్రికలో ఆగస్టు నెల సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సచివాలయ సిబ్బందితో కలిసి అర్హులైన లబ్ధిదారులకు ఇంటి వద్దకే పింఛన్లు అందజేశారు.
ఈ సందర్భంగా పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లను రూ.4,000కు పెంచి అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తోందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదని, అర్హులైన పలువురి పింఛన్లు కూడా తొలగించారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ప్రతి నెల మొదటి తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందించే విధానాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
పింఛన్ పంపిణీ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజు, వార్డు సచివాలయం వీఆర్వో శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతామని పరుచూరి ప్రసాద్ పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news