భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రి నారా లోకేష్‌ను అభినందించారు. విమానాశ్రయం నుంచి బయలుదేరుతున్న ప్రధాని మోదీకి మంత్రి నారా లోకేష్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆప్యాయమైన సంభాషణ చోటుచేసుకుంది.
మంత్రి నారా లోకేష్ పనితీరును ప్రశంసిస్తూ ప్రధాని మోదీ ఆయన భుజం తట్టి అభినందించినట్లు సమాచారం. “నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు.. శెహబాష్ లోకేష్” అంటూ ప్రధాని అభినందించినట్లు తెలుస్తోంది. ప్రజా సేవలో ఇదే వేగం, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన సూచించినట్లు సమాచారం.
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా శ్రీకారం చుట్టారు.
మంత్రి నారా లోకేష్ ఇటీవల చేపడుతున్న కార్యక్రమాలు, పరిపాలనలో చురుకైన పాత్రను ప్రధాని మోదీ ప్రశంసించినట్లు తెలుస్తోంది. యువ నాయకుడిగా రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, విద్యా రంగ సంస్కరణలు వంటి అంశాలపై లోకేష్ దృష్టి సారిస్తున్నారని కూటమి నేతలు పేర్కొంటున్నారు.
ప్రధాని మోదీ, మంత్రి లోకేష్ మధ్య జరిగిన ఈ ఆప్యాయ కలయిక కార్యక్రమానికి హాజరైన నేతలు, కార్యకర్తల దృష్టిని ఆకర్షించింది. భవిష్యత్‌లో కూడా అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా కొనసాగించాలని ప్రధాని ఇచ్చిన సూచనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news