భోగాపురంలో నిర్వహిస్తున్న బహిరంగ సభా వేదిక వద్దకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. ప్రత్యేక కార్యక్రమాల అనంతరం ఓపెన్ టాప్ జీపులో సభా ప్రాంగణానికి వచ్చిన ప్రధానమంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల మధ్య సభా ప్రాంగణం సందడిగా మారింది.
ప్రధాని మోదీతో పాటు ఈ బహిరంగ సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సభకు హాజరయ్యారు. వేదికపై ప్రముఖ నేతల సమక్షంలో కార్యక్రమం కొనసాగుతోంది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహిస్తున్న ఈ సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, విమానయాన రంగ విస్తరణ వంటి అంశాలపై ప్రధానమంత్రి మోదీ ప్రసంగించనున్నారు. సభ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టంగా చేపట్టారు. పోలీసు బలగాలు, ప్రత్యేక భద్రతా బృందాలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news