మహారాష్ట్రలోని చారిత్రక సింహగడ్ కోట వద్ద "ముస్లింలకు ప్రవేశం లేదు" అనే సందేశంతో కూడిన పోస్టర్ వెలుగులోకి రావడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ పోస్టర్ బయటపడిన వెంటనే పుణే గ్రామీణ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై నాన్-కాగ్నిజబుల్ (ఎన్సీ) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంబంధిత పోస్టర్‌కు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేదని, అది అధికారిక ఆదేశం కాదని పోలీసులు స్పష్టం చేశారు పోలీసుల సమాచారం ప్రకారం, ఈ పోస్టర్ సింహగడ్ కోట ప్రధాన ప్రవేశ ద్వారం సమీపంలోని వాహనాల పార్కింగ్ ప్రాంతం వద్ద పాత ఇనుప బోర్డుపై అతికించి కనిపించింది. మరాఠీ భాషలో రాసిన ఈ పోస్టర్లో "ఈ కోట హిందువులది. ముస్లింలకు ప్రవేశం లేదు" అని పేర్కొనడంతో పాటు చివరలో "ఆదేశానుసారం" అనే పదాలను ఉపయోగించారు. దీంతో అది ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులా కనిపించేలా ప్రయత్నించినట్లు అధికారులు భావిస్తున్నా అయితే, ఈ పోస్టర్‌పై వెంటనే స్పందించిన అటవీ శాఖ అధికారులు దానిని తొలగించారు. సింహగడ్ కోట మరియు పరిసర ప్రాంతాలు అటవీ శాఖ పరిధిలో ఉండటంతో, అలాంటి నోటీసు తమ శాఖ లేదా మరే ప్రభుత్వ విభాగం నుంచి జారీ కాలేదని అధికారులు స్పష్టం చేశారు. పోస్టర్ పూర్తిగా అనధికారికమని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా రూపొందించబడిందని పేర్కొన్నారు.
ఈ ఘటనపై పుణే గ్రామీణ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై ఎన్సీ నమోదు చేశారు. ప్రస్తుతం పోస్టర్‌ను అతికించిన వ్యక్తులను గుర్తించేందుకు కోటకు వెళ్లే మార్గాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. పోస్టర్‌ను ఎవరు, ఏ ఉద్దేశంతో అతికించారనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
రుFetching videos...
Fetching latest news...
No trending news